నేను పోటీ చేయట్లేదు: ఉపాసన చరణ్
Submitted by tc editor on Mon, 2019-01-28 15:20
Upasana denies political entry
Monday, January 28, 2019 - 15:15

రామ్‌చరణ్ భార్య ఉపాసన తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని వార్తాకథనాల మాట. ఉపాసన పిన్ని భర్త కొండా విశేశ్వర్ రెడ్డి.. ఇటీవలే తెరాసని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తెరాసలో నియంతృత్వ పోకడలున్నాయని ఆరోపిస్తూ ..కాంగ్రెస్ గెలుస్తుందన్న భ్రమలో పార్టీని వీడారు. కానీ తెరాస మళ్లీ బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది.
ఇపుడు విశేశ్వర్ రెడ్డిపై ఉపాసనని పోటీలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఉపసాన మాత్రం వీటిని మొగ్గలోనే తుంచేశారు. రాజకీయాల్లోకి తాను అడుగుపెడుతున్నట్లు వస్తున వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
- Log in to post comments