బేవాఫా బ్యూటీగా ఊర్మిళ రీ ఎంట్రీ

Urmila Matondkar returns after nine years as Bewafa Beauty
Thursday, March 22, 2018 - 15:00

తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పైన ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది రంగీళ సుంద‌రి ఊర్మిళ‌. ఈ సారి ఆమె ఐటెంగాల్‌గా క‌నిపించ‌నుంది. అవును బేవాఫా బ్యూటీగా ఊర్మిళ అద‌ర‌గొట్టనుంది. ఇర్ఫాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘బ్లాక్‌మెయిల్‌’ సినిమాలో ఊర్మిళ ఒక‌క ఐటమ్‌ సాంగ్‌లో మెరిశారు. 44 ఏళ్ల ఊర్మిళ ఈ ఏజ్‌లోనూ అందంగా అద‌ర‌గొట్టారు. ఒంపుసొంపుల హోయల‌తో క‌వ్విస్తున్నారు.

ఊర్మిళ‌ని హీరోయిన్‌గా ఎంతో పాపుల‌ర్ చేసిన వ‌ర్మ ఆమె రీ ఎంట్రీని స్వాగ‌తించాడు. ‘వావ్‌..‘రంగీలా’ భామ ఇప్పటికీ అంతే అందంగా ఉంది. ఫరెవర్‌ గ్రీన్‌ ఊర్మిళను ఈ పాటలో చూశారా’ అంటూ బేవాఫా బ్యూటీ వీడియోని షేర్ చేశాడు వ‌ర్మ‌

రెండేళ్ల క్రితం ఊర్మిళ ఒక వ్యాపారవేత్త‌ని పెళ్లాడింది. పెళ్లి త‌ర్వాత ఆమె రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. గ‌త తొమ్మిదేళ్లుగా ఆమె సినిమాల‌కి దూరంగా ఉంటూ వ‌స్తోంది.