17న నాని, సుధీర్‌ ‘వి’ టీజర్‌

V teaser to release on Feb 17
Monday, February 10, 2020 - 21:30

నాని నటిస్తోన్న 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. కాపాడే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మరో  హీరో సుధీర్‌బాబు నటిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలోఅదితిరావు హైదరి, నివేదాథామస్‌ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి బాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నది థమన్.  

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో  శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు.