ఇప్పటికీ మారలేదు ఆ హీరో!

Vadde Naveen spotted in a function
Thursday, February 6, 2020 - 11:15

పెళ్లి సినిమా గుర్తుందా.. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వడ్డే నవీన్. ఆ సినిమాతో అతడికి ఫిమేల్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. మరో జగపతిబాబు అన్నారప్పుడు. ఎత్తు, కలర్, లుక్స్ విషయంలో వడ్డే నవీన్ హ్యాండ్సమ్ హీరో అనిపించుకున్నాడు. కట్ చేస్తే, ఈ హీరో ఇప్పటికీ అలానే ఉన్నాడు.

పెద్దగా పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించని ఈ హీరో, తాజాగా కొడుక్కి పంచెకట్టు ఫంక్షన్ చేశాడు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇప్పటితరం నటుల వరకు చాలామంది హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత ఆ ఫొటోల్లో కనిపించిన వడ్డే నవీన్, అప్పటికీ ఇప్పటికీ లుక్స్ పరంగా ఏమాత్రం మారలేదు. మనిషి కాస్త లావు అయ్యాడు తప్పితే, గ్లామర్ మాత్రం అలానే ఉంది.

ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా జరిగాడు వడ్డే నవీన్. తన సొంత వ్యాపారాలపై దృష్టిపెట్టాడు. 2016లో వచ్చిన అటాక్ సినిమాతో విలన్ గా మారినా నవీన్ కు కెరీర్ కలిసిరాలేదు. ఇక ఆ సినిమా తర్వాత కెమెరాకు పూర్తిగా బై చెప్పేశాడు. అయితే మంచి క్యారెక్టర్స్ దొరికితే జగపతిబాబులా వడ్డే నవీన్ మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వడం గ్యారెంటీ. ఫంక్షన్ లో అతడ్ని చూసిన వాళ్లంతా ఇలానే అనుకున్నారు.