జాల‌రి కాదు ఉప్పెన‌

Vaishnav Tej debut film titled Uppena
Tuesday, May 7, 2019 - 15:45

సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు హీరోగా న‌టిస్తున్న తొలి చిత్రానికి టైటిల్ కుదిరింది. ఇంత‌కుమందు మీడియా రాసిన జాల‌రి అనే టైటిల్ త‌ప్ప‌ని తేలింది. ఈ చిత్రానికి "ఉప్పెన‌" అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో అసిస్టెంట్‌గా ప‌నిచేసిన బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం కొన్ని రోజుల కిత్రం లాంఛ‌నంగా ప్రారంభం అయిందఇ.

"క‌థకు ఎలాంటి టైటిల్ పెట్టాల‌నే దానిపై చాలా ఆలోచించాం. క‌థ‌కు త‌గిన విధంగా `ఉప్పెన‌` టైటిల్ అయితే ప‌క్కాగా సూట్ అవుతుంద‌ని ఆ టైటిల్‌నే నిర్ణ‌యించాం. త‌మిళంలో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న న‌టుడు విజయ్ సేతుప‌తి ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామ,"ని  చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.