సోలోమన్ వల్లే పైడిపల్లికి ఈ సమస్య

Vamshi Paidipally gets setback due to Solomon
Monday, February 24, 2020 - 13:45

వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి సినిమా తీసి నెక్స్ట్ మూవీ కూడా ఆ సూపర్ స్టార్ తోనే ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. వంశీ పైడిపల్లికి మహేష్ బాబు దాదాపు 8 నెలల టైం ఇచ్చాడు స్క్రిప్ట్ రెడీ చేసుకునేందుకు. కానీ పైడిపల్లి మహేష్ కి నచ్చే స్టోరీ రెడీ చెయ్యలేక పోయాడట. అందుకే, మహేష్ బాబు వంశీ సినిమాని పక్కన పెట్టాడు. ఇది వంశీకి పెద్ద షాక్. ఐతే, పైడిపల్లికి ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆరా తీస్తే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 

పైడిపల్లి డైరెక్షన్ బాగా చేస్తాడు కానీ స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో వీక్. ఇతర రచయితల మీదే ఆధారపడుతాడు. వంశీకి బాగా పేరు తెచ్చిన మూవీ..ఊపిరి. అది ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్. దాన్ని తెలుగులో బాగా రాసిన వ్యక్తి... సోలొమన్. అతను ...మహర్షి సినిమాకి కూడా రైటర్ హరితో కలిసి పని చేశాడు. అది కూడా హిట్ అయింది. అయితే, ఈ సోలొమన్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి నాగార్జున హీరోగా 'వైల్డ్ డాగ్' పేరుతో ఒక థ్రిల్లర్ ని తీస్తున్నాడు. దాంతో ఆయన ఇప్పుడు వంశీ సినిమాకి స్క్రిప్ట్ రైటింగ్ లో సిట్టింగ్ వెయ్యలేకపోయాడు. అది పెద్ద సెట్ బ్యాక్.  

తొలి సినిమా "మున్నా", ఆ తర్వాత బృందావనం సినిమాకి వంశీ పైడిపల్లికి రైటింగ్ విషయంలో కొరటాల శివ అండగా ఉన్నాడు. ఇప్పుడు శివ టాలీవుడ్ లో బిగ్ డైరక్టర్. వంశీ పైడిపల్లికి ఇప్పుడు సరైన రైటర్ (హరి మినహా) లేక... ఇబ్బంది పడ్డాడు. టైంకి మహేష్ కి నచ్చే స్క్రిప్ట్ చెప్పలేకపోయాడు.