వంశీ రాస్తున్న ఆటోబ‌యోగ్ర‌ఫీ

Vamsi penning autobiography
Saturday, March 30, 2019 - 10:45

మంచుప‌ల్ల‌కీ, సితార‌, అన్వేష‌ణ‌, ప్రేమించు పెళ్లాడు, లేడీస్ టైల‌ర్‌, చెట్టుకింద ప్లీడ‌ర్‌, ఏప్రిల్ 1 విడుద‌ల‌, ఔన్ వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, గోపి గోపిక గోదావ‌రి... ఇలా ఎన్నో చిత్రాల‌ను అందించిన ద‌ర్శ‌కుడు వంశీ. ఆయ‌నకున్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. గోదావ‌రి నేప‌థ్యంగా ఆయ‌న తీసిన సినిమాలు తెలుగునాట ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. ఆయ‌న తొలినాళ్ల‌ల్లో తీసిన ప్ర‌తి చిత్రం అద్భుత‌మే. వంశీ సినిమాల్లోని ఇళ‌య‌రాజా సంగీతానికి ఫ్యాన్ కాని మ్యూజిక్ ల‌వ‌ర్ ఉండ‌రు.

వంశీ గొప్ప ద‌ర్శ‌కుడే కాదు మంచి ర‌చ‌యిత కూడా. ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌లు, న‌వ‌లలు, వ్యాసాలు రాశారు. ఇపుడు త‌న ఆటోబయోగ్ర‌ఫీ రాస్తున్నార‌ట‌. "పొలమారిన జ్ఞాప‌కాలు" పేరుతో త‌న జీవిత చరిత్ర‌ని రాస్తున్నారు. ఇది త్వ‌ర‌లోనే స్వాతి ప‌త్రికలో సీరియ‌ల్‌గా రానుంది. 

ఇప్ప‌టికే ఆయ‌న త‌న సినిమాల గురించి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన చాలా వ్యాసాలు పాపుల‌ర్ అయ్యాయి.