బ్లౌజ్ పైన రామనామం, వాణికి సెగ

Vani Kapoor wears blouse with Rama Namam
Saturday, November 16, 2019 - 13:15

వాణి కపూర్ కి ట్రోలింగ్ సెగ బాగా తగిలింది. చిన్న వయసులోనే ఈ భామ రామనామం జపించడం మెచ్చుకోతగిందే. కానీ... రామకోటితో కూడిన బ్లౌజ్ ని కుట్టించుకొని.... దాని తొడుక్కొని వివాదంలో ఇరుక్కొంది. అదీ కూడా ఫుల్లుగా తన ఎద సంపద అంతా కనిపించేలా ధరించింది. ఈ పోస్ట్ ఇంస్టాగ్రామ్ లోకి రాగానే హిందూ సంఘాలు మండిపడ్డాయి. వాణి కపూర్ ని నెటిజన్లు  ఓ రేంజీలో ఆదుకున్నారు. ట్రోలింగ్ తో నిద్ర లేకుండా చేశారు.

దాంతో... వెంటనే వాణి కపూర్ ఈ ఫోటోని డిలిట్  చేసింది. 

వాణి కపూర్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ వార్ సినిమాలో నటించింది. తెలుగులో నాని సరసన 'ఆహా  కళ్యాణం' సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ పరాజయం పలు అయింది. జనరల్ గా ఇలాంటి దుస్తులు (హిందూ దేవుళ్ళు) హాలీవుడ్ హీరోయిన్లు ధరిస్తుంటారు. వాళ్ళకి అదొక రకమైన ఫ్యాషన్. మన బాలీవుడ్ హీరోయిన్లకి కూడా మన సంస్కృతి తెలీకుండా పోతున్నట్లు ఉంది.