వర్మను ఆపలేకపోయిన కరోనా

Varma shots down rumors of corona
Saturday, July 4, 2020 - 18:45

కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మాత్రం కరోనా ఆపలేకపోయింది. లాక్ డౌన్ టైమ్ లో కూడా 2 సినిమాలు (క్లైమాక్స్, నగ్నం) రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచాడు.

తనకు కరోనా లేదని, తన సినిమాల షూటింగ్స్ ఆగవని స్పష్టంచేసిన వర్మ.. ఒకేసారి ఏకంగా 4 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఈ 4 సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. వీటిలో పవన్ కల్యాణ్ పై తీస్తున్న "పవర్ స్టార్" అనే సినిమాతో పాటు.. "కరోనా" అనే మరో మూవీ కూడా ఉంది.

అటు మారుతిరావు-అమృతల కథతో ప్రకటించిన "మర్డర్" సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చిన వర్మ.. సైమల్టేనియస్ గా "12’o’CLOCK" అనే ఓ హారర్ సినిమాను కూడా తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ 4 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ శ్రేయాస్ యాప్/ఆర్జీవీ వరల్డ్ లో విడుదల చేస్తాడు వర్మ. ఒక్కో సినిమాపై వస్తున్న బజ్ బట్టి టిక్కెట్ రేట్ ఉంటుంది.