ఆ ఛాన్స్ వస్తే పండగే: వరుణ్ తేజ్

Varun Tej's interaction with fans
Wednesday, April 15, 2020 - 10:00

క్వారంటైన్ టైమ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. తన పర్సనల్ విషయాలతో పాటు మిగతా మెగా హీరోలపై కూడా స్పందించాడు. అందులోంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీ కోసం..

పవన్ లో మీకు నచ్చినదేంటి?
పవన్ కల్యాణ్ లో నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం.

గుర్రపుస్వారీ చేశారా?
గతంలో ఓసారి చరణ్ అన్నతో కలిసి గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేశాను. అప్పుడు ఓసారి గుర్రంపై నుంచి పడ్డాను. అంతే.. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు గుర్రం ఎక్కలేదు.

సూపర్ మేన్ క్యారెక్టర్ చేయాలంటే..?
కెరీర్ లో సూపర్ మేన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే కచ్చితంగా బ్యాట్ మేన్ పాత్రను సెలక్ట్ చేసుకుంటాను

కమర్షియల్ హిట్ లేదా కంటెంట్ లో ఏది ముఖ్యం? నిజంగా కంచె లాంటి స్టోరీ మళ్లీ వస్తే చేస్తారా? ఎందుకంటే.. కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ అది ఫ్లాప్ కదా!
సినిమాల్లో కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఇక నా విషయానికొస్తే.. కంచె లాంటి స్క్రిప్ట్స్ కోసం నేను వెయిటింగ్

ఏ జానర్ సినిమాలంటే ఇష్టం?
యాక్షన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం

చిరంజీవి గురించి....
ప్రతి ఒక్కర్ని ఆయన ప్రోత్సహించే నైజం నాకు నచ్చుతుంది

ఆల్ టైమ్ ఫేవరెట్ కార్టూన్
శ్వాట్ క్యాట్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్.  అవి చూస్తూ పెరిగాను నేను.

ఫేవరెట్ బాలీవుడ్ హీరో?
షారూక్ ఖాన్

పవన్ తో సినిమా?
ఆ ఛాన్స్ వస్తే నాకంటే ఆనందపడే వాడు ఈ భూమ్మీద ఎవ్వరూ ఉండరు

ఈమధ్య కాలంలో కొన్న మంచి వస్తువు
ఇంట్లోకి ఓ స్నూకర్ టేబుల్ కొనుక్కున్నాను. ఈమధ్య కాలంలో నేను కొన్న మంచి వస్తువు. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో బాగా పనికొస్తోంది,

ఈ లాక్ డౌన్ టైమ్ లో నెక్ట్స్ సినిమా ఎలా?
నా బాక్సింగ్ ట్రయినర్ నాతోనే ఉన్నాడు. సో.. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువ టైమ్ బాక్సింగ్ తోనే. అలా సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను.

కొన్ని కథలున్నాయి, దర్శకత్వం వహించాలని కూడా ఉంది. ఎలా?
దీని కోసం ఓ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో మీ అందరికీ ఆ ఈ-మెయిల్ ఐడీ చెబుతాను.

సాయితేజ్ తో మల్టీస్టారర్?
కచ్చితంగా సాయితేజ్ తో మల్టీస్టారర్ చేయాలని ఉంది. కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండే స్క్రిప్ట్ ఉంటే వినాలని ఉంది.

నెగెటివ్ ట్వీట్స్, ట్రోల్స్ పై అభిప్రాయం?
పెద్దగా పట్టించుకోను.

పవన్ సినిమాల్లో ఎక్కువగా చూసిన మూవీ?
తమ్ముడు సినిమాను ఎక్కువ సార్లు చూశాను