వెంక‌టేష్ కండీష‌న్ అదే

Venkatesh puts conditions
Sunday, September 9, 2018 - 19:00

వెంకటేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌. వెంకీ హీరో, త్రివిక్ర‌మ్ రైట‌ర్‌గా వ‌చ్చిన నువ్వు నాకు న‌చ్చావు, మ‌ల్లీశ్వ‌రి చిత్రాలకి ఎందరో అభిమానులున్నారు. రైట‌ర్‌గా వెంకీ సినిమాలకి ప‌నిచేసిన త్రివిక్ర‌మ్‌..ఆయ‌న్ని డైర‌క్ట్ మాత్రం చేయ‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కు. అది ఇపుడు సెట్ అయ్యేలా ఉంది. త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో వెంకీ హీరోగా ఇప్ప‌టికే ఒక సినిమా అనౌన్స్ అయింది. ఐతే అది మెటిరియ‌లైజ్ అవుతుందా అనే విష‌యంలో అంద‌రిలోనూ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే త్రివిక్ర‌మ్ ఇపుడు నేటిత‌రం పెద్ద హీరోల‌తోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. 

అర‌వింద స‌మేత విడుద‌ల త‌ర్వాత బ‌న్ని హీరోగా సినిమా చేసే అవ‌కాశం ఉంద‌నేది టాక్‌. మ‌రి వెంకీ సోలో హీరోగా త్రివిక్రమ్ సినిమా సంగ‌తేంటి? ఇదే విష‌యం వెంకీ కూడా ఆరా తీశాడ‌ట‌. ఇటీవ‌ల హారిక హాసిని నిర్మాత‌లు మ‌రో సినిమా ప్ర‌పోజ‌ల్‌తో వెంకీ వ‌ద్ద‌కి వెళ్తే త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో మాత్ర‌మే చేస్తాన‌ని ఖ‌రాఖండీగా చెప్పాడ‌ట‌. డాలీ డైర‌క్ష‌న్‌లో ఒక హిందీ సినిమాని రీమేక్ చేద్దామ‌న్న హారిక వారి ఆలోచ‌న అలా వ‌ర్క‌వుట్ కాలేదు. 

వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్‌2 అనే సినిమాలో న‌టిస్తున్నాడు.