పెళ్లిచూపులు టు రేసుగుర్రం

Venkatesh's next with director Tharun Bhascker
Tuesday, September 24, 2019 - 14:45

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు తరుణ్‌ భాస్కర్‌. గొప్ప టాలెంట్‌ అని ప్రశంసలు అందుకున్నాడు. ఐతే తరుణ్‌ భాస్కర్‌కి ఆ తర్వాత పక్కచూపులు ఎక్కువయ్యాయి. అదేనండి... నటనపై ఫోకస్‌ పడింది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాడు. హీరోగా నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇంతకుముందు ఫలక్‌నుమా దాస్‌ చిత్రంలో లెంగ్తీ రోల్‌ చేశాడు. 

ఇక యాక్టింగ్‌ పక్కన పెట్టి డైరక్షన్‌ చేస్తే బెటర్‌ అని ఫ్రెండ్స్‌ సలహా ఇవ్వడంతో మళ్లీ డైరక్షన్‌ చేపడుతున్నాడు. పెళ్లిచూపులు తర్వాత తీసిన ఈ నగరానికి ఏమైంది...సోసోగా ఆడింది. ఇపుడు మూడో సినిమాని ఏకంగా పెద్ద స్టార్‌తో చేస్తున్నాడు. వెంకటేష్‌ హీరోగా ఈ కొత్త సినిమా షురూ అవుతుందట. హైదరాబాద్‌ రేసు క్లబ్‌ల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. గుర్రాలు, గుర్రప్పందెలు ఈ సినిమా స్టోరీ. అంటే వెంకటేష్‌ రేసుగుర్రం అన్నమాట. 

తరుణ్‌ భాస్కర్‌... సీనియర్‌ హీరోని ఎలా హ్యండిల్‌ చేస్తాడు. ఎలా చూపిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. వెంకటేష్‌ కూడా ఈ మధ్య వరుసగా మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ కొత్త తరహా దర్శకుడితో సోలో సినిమాలో ఎలా ఇమడగలడో అనేది చూడాలి.