ఇది వెంకీ వేదాంతం

This is Venkatesh's philosophy
Wednesday, December 11, 2019 - 09:30

హీరో వెంకటేష్ తో ఓ సెపరేట్ యాంగిల్ ఉంది. అదే ఆధ్యాత్మిక, తాత్విక కోణం. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మరోసారి వెంకటేష్, తనలోని తాత్వికుడ్ని బయటకు తీశాడు. ప్రశాంతంగా ఎలా ఉండాలో అభిమానులకు జ్ఞానోపదేశం చేశారు.

"ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయ్యామని అనుకుందాం. ఆరోజు మనందరం పడుకుంటాం. అంటే ఆ టైమ్ లో ఆ ఫెయిల్యూర్ ను మనం మరిచిపోయామన్నమాట. అంత పెద్ద స్ట్రగుల్ ను కూడా ఒక్క నిద్రలో మరిచిపోయారు. సో.. ప్రతి టెన్షన్ లో ఆ రిలాక్స్ మూడ్ ను తీసుకురావాలి. ఏ విషయంలో ఎక్స్ ట్రీమ్ గా ఆలోచించకూడదు. మోడరేట్ గా ఉండాలి. ఎక్కువ టెన్షన్ పడితే పని జరగదు, ఏం జరగాలో అది జరుగుతుంది. ప్రతిసారి ఇలా ఆలోచిస్తే ప్రశాంతంగా ఉంటాం."

మన చుట్టూ నెగెటివ్ గా ఆలోచించే వ్యక్తుల్ని ఉంచకూడదని సలహా ఇస్తున్నాడు వెంకీ. ఎవరైతే నెగెటివ్ గా మాట్లాడుతున్నారో, నెగెటివ్ గా ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్లందర్నీ కట్ చేస్తే సగం ప్రశాంతత వచ్చినట్టే అంటున్నారు. అక్క, చెల్లి, తమ్ముడు, స్నేహితుడు, తల్లి, తండ్రి.. లాంటి బేధాల్లేకుండా నెగెటివ్ గా ఉండే వాళ్లను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

తన కెరీర్ లో ప్రతి ఫెయిల్యూర్ ను ఇలానే ఫేస్ చేస్తానంటున్నాడు వెంకీ. జస్ట్ ఓ రాత్రి మాత్రమే తనను ఆ ఫెయిల్యూర్ బాధిస్తుందని, మరుసటి రోజు నుంచి ఓ కొత్త ఉదయాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. తను మాత్రమే కాకుండా, తన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారంటున్నాడు విక్టరీ వెంకటేష్.