వెంకీ మామ రేటింగ్ ఎంత?

Venky Mama gets good TRP in its TV premiere
Thursday, July 23, 2020 - 12:45

బుల్లితెరపై ఈవారం (జులై 11-17 వరకు) కొత్త సినిమా ఒకే ఒక్కటి పడింది. మిగతావన్నీ ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమాలే. అలా ఒకే ఒక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విడుదలైన "వెంకీమామ".. రేటింగ్స్ లో మెరిసింది. బుల్లితెరపై మామాఅల్లుళ్ల మేజిక్ పనిచేసింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా.. 11వ తేదీన జెమినీలో ప్రసారమైన "వెంకీమామ" సినిమాకు 8.50 (ఏపీ+తెలంగాణ) టీవీఆర్ వచ్చింది. రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్-నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాకు వెండితెరపై పెద్దగా ఆదరణ దక్కనప్పటికీ.. బుల్లితెరపై మాత్రం మంచి రేటింగ్ వచ్చింది.

ఇక ఈ వారం టాప్-5 సినిమాల విషయానికొస్తే.. రెండో స్థానంలో "వినయవిధేయ రామ" (6.79), మూడో స్థానంలో "డియర్ కామ్రేడ్" (5.06).. నాలుగో స్థానంలో "గంగ" (4.96).. ఐదో స్థానంలో "ప్రతి రోజూ పండగే" (4.21) సినిమాలు నిలిచాయి.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ఎప్పట్లానే స్టార్ మా ఛానెల్ అగ్రస్థానంలో నిలవగా..ఈటీవీ రెండో స్థానంలో, జీ తెలుగు మూడో స్థానంలో, జెమినీ నాలుగో స్థానంలో నిలిచాయి