ఇక వెంకీ మామ వంతు!

Venky Mama for Pongal
Sunday, October 13, 2019 - 17:45

సంక్రాంతి బరిలో ఒకే రోజున వస్తున్నామని ప్రకటించాయి 'ఆల వైకుంఠపురంలో', 'సరిలేరు నీకెవ్వరు'. రెండూ జనవరి 12న విడుదల కానున్నాయి. సంక్రాంతి టైంకి ఈ రెండు సినిమాల డేట్స్ ఒక రోజు అటు ఇటుగా మారొచ్చు కానీ పండుగ టైంలోనే పోటీకి దిగుతాను అంటూ మరో  హీరో రెడీ అవుతున్నాడు.

వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటిస్తున్న 'వెంకీ మామ' నిజానికి అక్టోబర్ లోనే రిలీజ్ కావాలి. ఆ తర్వాత డిసెంబర్ కి అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం... జనవరి 13 కానీ, 14కానీ రిలీజ్ కానుందట. అంటే సంక్రాంతి కి మూడు పెద్ద తెలుగు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ కూడా వస్తుంది. బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ ఇది. వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత సురేష్ బాబు చాలా పక్కాగా ఉంటారు. ఆయన వేసిన స్కెచ్ ఇది. 

సంక్రాంతి టైములో మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ కావడం చాలా కామన్. అందులో వింతేమీ లేదు. కానీ థియేటర్స్, ఓపెనింగ్స్ వంటి వాటి విషయాలలోనే తంటా.