కలల్లో డైరెక్టర్.. రియాల్టి చూపించిన జనం

Vi Anand comes to reality
Monday, January 27, 2020 - 20:30

రవితేజతో తీసిన డిస్కో రాజా పెద్ద హిట్ అయిపోతుంది అని, తనకి పెద్ద పేరు వస్తుంది అని ఎన్నో డ్రీమ్స్ వేసుకున్నాడు డైరక్టర్ విఐ ఆనంద్.  ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని ముందే ఫిక్స్ అయ్యాడు దర్శకుడు వీఐ ఆనంద్. దీనికి సంబంధించి ఆల్రెడీ చిన్నపాటి చర్చ కూడా జరిగిందంటున్నాడు డైరక్టర్.

"నాకు రవితేజకు మధ్య ఆల్రెడీ డిస్కషన్లు జరిగాయి. డిస్కోరాజాకు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఇద్దరికీ ఉంది. ఆయన కమిట్ మెంట్స్, స్క్రిప్ట్ షేప్ బట్టి రాబోయే రోజుల్లో ఆలోచిస్తాం. డిస్కోరాజా అనే క్యారెక్టర్ తో ఎన్ని మేజిక్స్ అయినా చేయొచ్చు," ఇలా మీడియాకి వివరించాడు. ఫస్ట్ వీకెండ్ తర్వాత రియాలిటీ తెలిసింది. ... జనం సినిమాని రిజెక్ట్ చేశారని. 

రవితేజ మాత్రం ఈ సినిమాతో కనెక్షన్ కట్ చేసుకున్నాడు. క్రాక్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాడు. సోమవారం రవితేజ ట్వీట్ చేశాడు. నిన్న (ఆదివారం) తనకి పుట్టిన రోజు విషెష్ చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పాడు. ఎక్కడ డిస్కో రాజా గురించి మెన్షన్ చెయ్యలేదు. అది రియాలిటీ.