దొరసాని విధివిలాసం ఇది

Vidhi Vilasham, Shivathmika's new film
Monday, January 20, 2020 - 18:45

అక్క సినిమా ఆగిపోయింది, ఇంకో సినిమా కూడా ఓకే కాలేదు. కానీ చెల్లెలు శివాత్మిక మాత్రం దూసుకుపోతోంది. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె, ఇప్పుడు తన రెండో సినిమా స్టార్ట్ చేసింది. ఈ కొత్త సినిమా పేరు విధివిలాసం. ఈరోజు అఫీషియల్ గా లాంచ్ అయింది.

టైటిల్ పాతగా ఉన్నప్పటికీ సినిమా చాలా కొత్తగా ఉంటుందంటోంది శివాత్మిక తల్లి జీవిత. లాంఛింగ్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన అమె, చిత్ర యూనిట్ కు బౌండెడ్ స్క్రిప్ట్ అందించారు. మరో దర్శకుడు దశరథ్ గౌరవ దర్శకత్వం వహించాడు. దొరసాని సినిమాలో క్యూట్ గా కనిపించిన శివాత్మిక, ఈ సినిమాలో కూసింత హాట్ గా కనిపిస్తుందని టాక్.

24 కిస్సెస్ సినిమాతో పాపులర్ అయిన అరుణ్ అదిత్, ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఆ సినిమాలో హెబ్బా పటేల్ ను ముద్దులతో ముంచెత్తిన అరుణ్, ఈ సినిమాలో మాత్రం శివాత్మికతో హాట్ సన్నివేశాలు ఉండవంటున్నాడు. అయితే తమ పెయిర్ మాత్రం చాలా రొమాంటిక్ గా ఉంటుందని చెబుతున్నాడు.