సైజు కాదు విషయం ఉండాలి: విద్య

Vidya Balan talks about short film debut
Tuesday, June 2, 2020 - 13:30

విద్యాబాలన్ నిర్మాతగా మారింది. "నట్కట్" పేరుతో ఆమె ఒక షార్ట్ ఫిలిం తీసింది. అది ఈ రోజు (జూన్ 2) ఆన్లైన్ లోకి వచ్చింది. "ఒకప్పుడు అన్ని సెవెంటీ ఎం.ఎం కలలే. కానీ ఏజ్ పెరిగిన తర్వాత, నటిగా మెచ్యూరిటీ వచ్చాక... సైజు ముఖ్యం కాదు అని అర్థం అయింది. సంతృప్తి ప్రధానం. పెద్ద తెర, చిన్న తెర కాదు... చెప్పే సబ్జెక్టు ముఖ్యం. అందుకే షార్ట్ ఫిలింలోకి అడుగుపెట్టాను," అని వివరించింది "ఎన్టీఆర్ బయోపిక్" నటి.

మంచి కథతో వస్తే మొబైల్ తో షూట్ చేస్తాను అని చెప్పినా ఒప్పుకుంటా అని అంటోంది విద్య.

"నట్కట్"లో ఆమె ఒక తల్లి పాత్ర పోషించింది. ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది చిన్నప్పుడే మగ పిల్లలకు నేర్పాలి అనే చెప్పే కథ ఇది. విద్య కూడా ఫెమినిస్ట్ గా మారుతోంది. "నేను పూర్తిగా ఫెమినిస్ట్ కాను. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకొండి," అని చెప్తోంది.

విద్య త్వరలోనే గణిత శాస్త్రవేత్త "శకుంతలా దేవి" బయోపిక్ లో నటించనుంది.