అపుడే 30కి వ‌చ్చింది

Vidyullekha Raman working in her 30th Telugu film
Thursday, December 14, 2017 - 15:15

"స‌రైనోడు" సినిమాలో సాంబారు పిల్ల‌గా న‌వ్వించిన విద్యు ఉర‌ఫ్ విద్యుల్లేఖ‌..అపుడే తెలుగులో 30 సినిమాలు పూర్తి చేస్తోంది. చెన్నైకి చెందిన ఈ బొద్దుగుమ్మ "ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు" సినిమాలో స‌మంత ఫ్రెండ్‌గా అరంగేట్రం చేసింది. ఐదేళ్లల్లోనే విద్యు ఖాతాలో సినిమాలు 30కి చేరాయి.

ఇపుడామె వ‌రుణ్ తేజ హీరోగా రూపొందుతోన్న "తొలి ప్రేమ" చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో ఆమెకిది 30వ మూవీన‌ట‌.

అన్న‌ట్లు ఈ మ‌ధ్య పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫోటోసూట్ చేసి వార్త‌ల్లో నిలిచింది. XL సైజ్‌లో తొడ‌లు చూపిస్తూ ఎక్స్‌పోజింగ్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో కొంటె కుర్రాళ్లు కామెంట్స్ పెట్టారు. దాంతో ఈ భామ వారిపై ఫైర్ అయింది.

సెక్స‌ప్పీల్ అనేది స్లిమ్‌గా ఉండ‌డంలోనే ఉంద‌నుకోవ‌డం పాత‌కాల‌పు భావజాల‌మ‌ని ఈ భామ రెచ్చిపోయి త‌న‌ని ట్రాలింగ్ చేసిన వారి నోళ్ళ‌ని మూయించింది.