ఈవెంట్ కి లుంగీలో వచ్చిన రౌడీ హీరో

Vijay appears in lungi on stage
Wednesday, February 12, 2020 - 20:15

విజయ్ దేవరకొండ ...స్టయిల్, స్వాగ్ వేరు. ఏమి చేసినా ఫ్యాషన్. ఈ రౌడీ హీరోకి ఆ రేంజులో ఉంది క్రేజ్ మరి. సినిమా విడుదల తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే.. తన సినిమాకి ఎంత పబ్లిసిటీ తీసుకు రావాలో, దానికి బజ్ ఎలా తేవాలో విజయ్ కి బాగా తెలుసు. వరుసగా ఈవెంట్స్ చేస్తాడు. రకారకాల డ్రెస్సింగ్ స్టైల్స్ తో ఆకట్టుకుంటాడు. 

తెల్లని పంచె కట్టుకొని సినిమా ఈవెంట్లకి రావడం చెన్నైలోనూ, కొచ్చిలోనూ చూస్తాము. కానీ నార్మల్ రంగురంగుల లుంగీ ధరించి ఒక సినిమా ఈవెంట్ కి ఈ హీరో రాడు. అందుకే విజయ్ ఆలా దర్శనం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఇలా దర్శనం ఇచ్చాడు. 

ఈ సినిమాలో విజయ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అందులో ఒకటి.. శీనయ్య అనే పాత్ర. ఆ రోల్ కి తగ్గట్లు లుంగీలో వచ్చాడు.