ఆ సినిమా ఆగిపోలేదు బాబోయ్

Vijay Deverakonda clarification about Hero
Thursday, October 31, 2019 - 15:45

తను నటిస్తున్న హీరో సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై హీరో విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తంచేశాడు. ఒకసారి ప్రారంభమైందని, మరోసారి ఆగిపోయిందని మీడియా రకరకాలుగా రాసేస్తోందని.. వాటిలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశాడు. ఫైనల్ గా హీరో ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

"విచిత్రం ఏంటంటే... హీరో  అనే సినిమా గురించి చెప్పాలంటే నిర్మాత లేదా డైరక్టర్ చెప్పాలి. లేదంటే నేను చెప్పాలి. కానీ మీడియా వాళ్లు అన్నీ చెప్పేశారు. ఒకసారి క్యాన్సిల్ అన్నారు, మరోసారి బ్యాక్ టు సెట్స్ అన్నారు. ఈ వార్తలకు ఆధారాలు నాకు తెలియదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. వరల్డ్ ఫేమస్ లవర్ కంప్లీట్ అయిన వెంటనే హీరో సినిమా స్టార్ట్ అవుతుంది. పూరి గారి సినిమా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది."

అయితే హీరో సినిమా మాత్రం లేట్ అవుతుందని స్పష్టంచేశాడు విజయ్ దేవరకొండ. యాక్షన్ సన్నివేశాలు తీయడానికి చాలా టైమ్ పడుతుందని, కచ్చితంగా ఆ సినిమాకు గ్యాప్ ఇస్తానని ప్రకటించాడు. అంతమాత్రానికే ప్రాజెక్టు ఆగిపోయినట్టు కాదని, అది నడుస్తూనే ఉంటుందని తెలిపాడు.

"హీరో సినిమాకు సంబంధించి ఇంకా టైమ్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రీ-విజన్ అనేది ఒకటి చేయాలి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సగం పూర్తిచేశాం. ఇంకా సగం చేయాలి. అవి భారీ యాక్షన్ సన్నివేశాలు. వాటికి ప్రీ-విజువలైజేషన్ చేయాలి. దానికి కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ పూరి గారి సినిమా ఎక్కించేస్తాను. ఆ తర్వాత హీరో చేస్తాను."

ఇలా తన అప్ కమింగ్ మూవీ సంగతులు చెబుతూనే, మరో బ్రేకింగ్ న్యూస్ కూడా బయటపెట్టాడు దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. పూరి సినిమా కంప్లీట్ అయిన తర్వాత హీరో సినిమా ఉంటుందని, ఆ వెంటనే శివ నిర్వాణ సినిమా ఉంటుందని తెలిపాడు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.