'విజయ్ దేవరకొండ నా ఆస్తి'

Vijay Deverakonda is my investment: Tharun Bhascker
Monday, August 3, 2020 - 10:15

టాలీవుడ్ కు వచ్చిన తర్వాత బాగానే ఆస్తులు సంపాదించుకున్నానంటున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే అతడు సంపాదించిన ఆస్తి భూములు, నగలు, బంగ్లాలు కాదు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, రీతూ వర్మ.. వీళ్లు తరుణ్ భాస్కర్ ఆస్తి అంట.

"విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలో నేను సంపాదిస్తున్న నా ఆస్తి వీళ్లు. నేను మళ్లీ ల్యాండ్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టను. వీళ్లే నా పెట్టుబడి. సో.. ఎప్పుడైతే నాకు అవకాశాలు తగ్గిపోతాయో ఆ రోజు నేను వీళ్లను తప్పకుండా వాడుకుంటాను. ఈ విషయం నేను విజయ్ కు కూడా డైరక్ట్ గా చెప్పాను. కాబట్టి విజయ్ దేవరకొండతో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చేయగలను."

సినిమాల్లో తనకు ప్యాకేజీ డీల్స్ నచ్చవంటున్నాడు తరుణ్ భాస్కర్. ఏ హీరోను పెడితే సినిమాకు ఎంత మార్కెట్ అవుతుంది లాంటి డీల్స్ చేయడంట. మనసుకు నచ్చిన స్క్రిప్ట్ తో కొత్త వాళ్లతో, కొత్త టెక్నీషియన్స్ తో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానంటున్నాడు. "పెళ్లి చూపులు" సినిమాకు సీక్వెల్ తీసే ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంచేశాడు ఈ దర్శకుడు.