ఆసమ్ .. ఫోర్ సమ్!

Vijay Deverakonda poses with four heroines
Sunday, February 9, 2020 - 23:30

విజయ్ దేవరకొండ ఒకే సినిమాలో నలుగురు భామలతో కలిసి నటించాడు. అందరితో కిస్ సీనులు ఉన్నాయి. రాశి ఖన్నా, కేథెరిన్, ఎలిజబెత్, ఐశ్వర్య రాజేష్ ... అందరితోనూ హాట్ రొమాంటిక్  దృశ్యాలు ఉన్నాయి. "వరల్డ్ ఫేమస్ లవర్" అనే టైటిల్ తో సినిమా తీసినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో నలుగురు భామలతో కలిసి పోజులు ఇచ్చాడు విజయ్. 

ఇదే చివరి లవ్ స్టోరీ అని చెప్పాడు. ఐతే, అభిమానుల కోసం ఏమైనా చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళు మళ్ళీ అడిగితే ... లవ్ స్టోరీ చేస్తాడు. 

"నా ఈ ప్రయాణంలో రెండు విషయాలు మారలేదు. ఒకటి మీ (అభిమానుల) ప్రేమ. రెండోది సిక్స్ కొట్టే రేంజ్ లో సినిమాలు చెయ్యాలన్న తపన." అని అన్నాడు విజయ్ దేవరకొండ.