విజయ్ దేవరకొండ క్రేజే వేరు

విజయ్ దేవరకొండకి యూత్‌లో యమా క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్‌రెడ్డి సినిమా హిట్ కావడం, ఆ తర్వాత తన యాటిట్యూడ్‌తో ఒక పద్దతి ప్రకారం యూత్‌కి చేరువయ్యాడు విజయ్ డి. అతని కొత్త సినిమాపై భారీ అంచనాలున్నాయి. గీత గోవిందం... విజయ్ తదుపరి చిత్రం. ఇది ఆగస్ట్ 15న విడుదల కానుంది. తొలి టీజర్ మండే విడుదలై...భారీ వ్యూస్‌ని పొందింది.
కేవలం 10 గంటల్లోనే టూ మిలియన్ వ్యూస్ పొంది..యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్‌లో నెంబర్‌వన్ పొజిషన్ అందుకొంది. అప్పటి వరకు టాప్ ప్లేస్‌లో ఉన్న శ్రీనివాస కల్యాణం సినిమాని కిందికి లాగింది. శ్రీనివాస కల్యాణం టీజర్..24 గంటల్లో 15 లక్షల వ్యూస్ పొందగా, గీత గోవిందం కేవలం 10 గంటల్లోనే 20 లక్షల వ్యూస్‌ని సాధించి. దీన్ని బట్టే చెప్పొచ్చు విజయ్ దేవరకొండకి ఏ రేంజ్‌లో పాపులారిటీ ఉందో.
ఐతే ఈ వ్యూస్, ఈ పాపులారిటీ ఎంత ఉన్నా... సినిమా హిట్ కావాలంటే కంటెట్‌లో దమ్ము ఉండాలి. కంటెంట్ ఉన్నపుడు రిలీజ్‌కి ముందు పెద్దగా హైప్ లేకపోయినా ఆడుతాయి. ఆర్ ఎక్స్ 100 సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అర్జున్‌రెడ్డి యూత్ తనపై చూపుతున్న ఆసక్తిని నిలబెట్టుకుంటాడా? గీత గోవిందం సినిమాతో మరో హిట్ అందుకుంటాడా అనేది ఆగస్ట్ 15న తేలుతుంది.
- Log in to post comments