విజ‌య్..ఇక‌నైనా మాట‌లు నేర్చుకోవాలి

Vijay Deverakonda should practise public speech
Friday, May 3, 2019 - 17:15

విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌బ్లిక్ స్టేజ్‌పై ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా క్యాజువ‌ల్‌గా మాట్లాడినా న‌డిచింది. ఇపుడు త‌న‌కంటూ ఒక క్రేజ్ ఉంది, ఒక స్టేచ‌ర్ వ‌చ్చింది. మార్కెట్ పెరిగింది. స్టార్‌డ‌మ్ సూప‌ర్ అయింది. అయితే ఇప్ప‌టికీ కాలేజ్ స్టూడెంట్‌లాగే మాట్లాడుతున్నాడు.

"మ‌హ‌ర్షి" సినిమాకి గెస్ట్‌గా వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌...తాను మ‌హేష్‌బాబు వీరాభిమాని అని తెలిపాడు. కానీ ఆ త‌ర్వాతే మ‌హేష్‌బాబుని సార్ అనాలా, కానీ త‌ప్ప‌దు అంటాను అని చెప్ప‌డం, అస‌లు ఆ లైఫ్ ఏంటి బ‌తికితే అలా బ‌త‌కాలి అంటూ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు మ‌రీ ప‌రిప‌క్వ‌త లేని కాలేజ్‌కుర్రాళ్ల మాటల్లా ఉన్నాయ‌నీ కానీ ఒక పెద్ద స్టార్ మాట‌ల్లా లేవు.

బాబూ విజ‌య్ ...మీరు ఇపుడు పెద్ద స్టార్‌. కొంచెం మాట‌లు నేర్చుకొండి. మీ స్ట‌యిల్‌లోనే క్యాజువ‌ల్‌గానే మాట్లాడండి..కానీ అందులోనూ కొంత మెచ్యుర్టీ చూపండి.