ఇదే చివరి లవ్ స్టోరీ: దేవరకొండ

Vijay Deverakonda will not do love stories again
Thursday, February 6, 2020 - 18:30

విజయ్ దేవరకొండ ఒకే తీరుగా కనిపిస్తున్నాడు. ఒకే తీరు ప్రేమకథలు చేస్తున్నాడు అనే కామెంట్ ఈ మధ్య వినిపిస్తోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం అంత సంచలన విజయం సాధించడం అతని కెరీర్ కి ఇబ్బందికరంగా మారింది. అంచనాలు పెరిగాయి. ఒప్పుకున్న సినిమాల్లో 'అంచనాలకీ' తగ్గ స్టఫ్ లేదు. అందుకే... ఇదే నా చివరి లవ్ స్టోరీ అని పబ్లిక్ గా ప్రకటించాడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాట అన్నాడు. 

అంటే ఇక లవ్ స్టోరీలు చెయ్యడం మానేసి, రకరకాల జానర్ లలో సినిమాలు చేస్తాడు. "నాకు తెలుసు.. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా.  నలుగురు బ్యూటిఫుల్ విమెన్ తో ఈ చివరి లవ్ స్టోరీ లో ఆక్ట్ చెయ్యడం ప్రౌడ్ గా ఉంది.  నలుగురూ తమ నటనతో చంపేశారు," అంటూ దేవరకొండ హీరోయిన్ లని పొగిడాడు. 

"అన్ని రకాల ప్రేమ నింపి ఈ స్క్రిప్టును నా దగ్గరకు తీసుకొచ్చాడు క్రాంతిమాధవ్. ఫిబ్రవరి 14న ఈ కంప్లీట్ ప్యాకేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ 47వ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. క్రాంతిమాధవ్ కు ఈ సినిమాతో అతిపెద్ద సక్సెస్ రావాలని కోర్చుకుంటున్నా" అని చెప్పాడు విజయ్

|

Error

The website encountered an unexpected error. Please try again later.