విజయ్ దేవరకొండ మనసు మార్చుకుంటాడా?

Vijay Deverakonda working on his next mass movie
Wednesday, August 7, 2019 - 15:45

మొన్నామధ్య మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో పూరి జగన్నాథతో సినిమా లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పాడు. పూరి, కొరాటలతో సినిమాలున్నాయట కదా అని అడిగితే....పూరితో ఏ మూవీ లేదు. కొరటాలతో అనుకుంటున్నాం కానీ చూడాలి ఎలా సెట్ అవుతుందో అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. ఐతే "డియర్ కామ్రెడ్" తర్వాత విజయ్ దేవరకొండ కొంత భయపడ్డాడు.

ఒక రాకెట్లా దూసుకొచ్చిన హీరో.... విజయ్ దేవరకొండ. నటనలో అద్భుతం. క్రేజ్లోనూ అదుర్స్. ఐతే ఏ హీరోకైనా హిట్స్ ఇస్తేనే క్రేజ్ నిలబడుతుంది. "గీత గోవిందం" తర్వాత "నోటా" ఫ్లాప్ కావడం, ట్యాక్సీవాలా 20 కోట్ల రూపాయల రేంజ్లో ఆడడం, ఇపుడు "డియర్ కామ్రెడ్"  ఫ్లాప్ కావడంతో... ఆయనకి భయం పట్టుకొంది. నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం అంత ఈజీ కాదు. ఉన్నది కాపాడుకోకపోతే ఆ తర్వాత చుక్కలు కనపడుతాయి. అందుకే దేవరకొండ ఒక మెట్టు దిగాడట..

విజయ్ ఇక కొత్త సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తనకున్న ఇమేజ్ ని పెంచుకోవాలంటే మాస్ సినిమా చేసి తీరాలనుకుంటున్నాడు. అందుకే.. ఈసారి.. "ఇస్మార్ట్ శంకర్"తో హిట్ కొట్టిన పూరిని జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు మొగ్గు  చూపుతున్నాడు. మొన్న వీకెండ్ పూరిని కలిశాడు. మరి ఈ కాంబినేషన్ నిజంగా వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి.

అన్నట్లు పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎవరి కోసం రాశాడో తెలుసా? విజయ్ కోసమే. విజయ్ దేవరకొండ హైదరాబాదీ, తెలంగాణ యాస ఇరగదీస్తాడనే ఉద్దేశంతోనే అలా కథ, డైలాగులు రాసుకున్నాడు. కానీ విజయ్ నో చెప్పడంతో రామ్తో తీశాడు. ఆ తర్వాతది హిస్టరీ.