విజయ్ దేవరకొండ ఏడిపిస్తాడు

Vijay Deverakonda's first sentiment movie!
Tuesday, May 19, 2020 - 14:15

యాక్షన్ సినిమాల నుంచి మాంచి ఫైట్స్ ఆశిస్తాం. పంచ్ డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. ఫైటర్ సినిమా నుంచి కూడా సాధారణంగా అవే ఆశిస్తారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అంతకుమించి అందిస్తామంటోంది నిర్మాతల్లో ఒకరైన చార్మి. ఫైటర్ కేవలం ఫైట్స్ చేయడమే కాకుండా ఏడిపిస్తాడని చెబుతోంది.

"విజయ్ దేవరకొండను పూర్తిగా మాస్ లుక్ లో చూస్తారు. పాన్-ఇండియా హీరోలా కనిపిస్తాడు. అయితే యాక్షన్, ఫైట్స్ తో పాటు మదర్ సెంటిమెంట్ ఇందులో చాలా బాగుంటుంది. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్లు హార్ట్ టచింగ్. మలేషియా ఫైటర్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. అతడికి భాష రాదు. అయినప్పటికీ విజయ్-రమ్యకృష్ణ సీన్ చూసి ఏడ్చేశాడు. అంత బాగా సెంటిమెంట్ సీన్లు వర్కవుట్ అయ్యాయి."

పూరి జగన్నాధ్ ఐప్యాడ్ లో చాలా కాన్సెప్టులు, స్టోరీలు ఉంటాయట.. కానీ ఫైటర్ స్టోరీ మాత్రం అందులోంచి తీసింది కాదంటోంది చార్మి.. కేవలం విజయ్ దేవరకొండ కోసం పూరి ప్రత్యేకంగా రాశాడట.

"ఫస్ట్ మీటింగ్ లోనే ఈ కథ చెప్పారు. ఆ మీటింగ్ లోనే ఈ కథ ఓకే అయిపోయింది. తర్వాత విజయ్ తన సినిమా షూట్ కోసం విదేశాలకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి డైలాగ్స్ తో పాటు టోటల్ స్క్రీన్ ప్లే రెడీ చేశారు పూరి. ఆ వెంటనే విజయ్ ఓకే చెప్పాడు. ఇప్పటివరకు అయిన షూటింగ్ కు సంబంధించి రషెష్ చూస్తుంటే.. ఆ పాత్రలో విజయ్ దేవరకొండను తప్ప మరో హీరోను ఊహించుకోలేకపోతున్నాం."

ఇక హీరోయిన్ గా అనన్య పాండేను కూడా కావాలనే తీసుకున్నామని, మరో హీరోయిన్ డేట్స్ దొరక్క అనన్యను తీసుకోలేదని చెబుతోంది చార్మి. బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ కావాలో టాప్-5 లిస్ట్ ఇవ్వమని కరణ్ జోహార్ అడిగితే.. అనన్య పాండే పేరు మాత్రమే చెప్పామంటోంది. అనన్య కూడా స్టోరీ విన్న ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేసిందని చెప్పుకొచ్చింది చార్మి.