ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన విజయ్

Vijay Deverakonda's indirect confirmation
Sunday, May 10, 2020 - 19:00

విజయ్ దేవరకొండ ...త్వరలోనే ఇంద్రగంటి మోహన కృష్ణ డైరక్షన్ లో ఒక భారీ మూవీ చెయ్యబోతున్నాడు అని తెలుగుసినిమా.కామ్ న్యూస్ బ్రేక్ చేసింది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. ఆ విషయాన్ని విజయ్ ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశాడు. తన బర్త్ డేకి విషెష్ తెలిపిన ప్రముఖులందిరికి థాంక్స్ చెపుతూ రిప్లైలు ఇచ్చాడు. అలాగే, దర్శకుడు ఇంద్రగంటి కూడా "ఈ ఏడాది నువ్వు చెయ్యబోయే అన్ని అమేజింగ్ థింగ్స్ కోసం ఎదురుచూస్తున్నా" అని విష్ చేశారు. అయన  శుభాకాంక్షలకు బదులు ఇస్తూ.. "మనం ఇద్దరం కలిసి చెయ్యబోయే ఒక అమేజింగ్ మాత్రం తెలుసు" అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు.

అది వీరి కాంబినేషన్ లో రాబోయే మూవీ అని గెస్ చెయ్యొచ్చు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. అది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత.. శివ నిర్వాణ డైరక్షన్ లోనూ, ఇంద్రగంటి దర్సకత్వంలోనూ సినిమాలు చేస్తాడు విజయ్.