విజయ్ కి కూడా భారీ కటౌట్

Vijay to have 50 ft cutout for Whistle
Tuesday, October 22, 2019 - 19:30

చిరంజీవి,  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వరకు... అందరూ కట్ అవుట్ స్టార్స్. లేటెస్ట్ జనరేషన్ లో రామ్, విజయ్ దేవరకొండ వంటి వారికి కూడా నిలువెత్తు కటౌట్లు పెడుతున్నారు అభిమానులు. కొత్త సినిమా విడుదల అయినప్పుడు ఇలాంటి తతంగం కామన్. 

ఇప్పుడు ఇలాంటి భారీ సైజు కటౌట్ తమిళ్ హీరోకి కూడా చూడబోతున్నాం. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో విజయ్ కి 50 ఫీట్ల కటౌట్ పెడుతున్నారట. విజయ్ నటించిన 'విజిల్' సినిమాని సంధ్య సెవెంటీ ఎం ఎం లో ప్రదర్శిస్తారు. ఈ నెల 25న విడుదల కానుంది విజిల్. అట్లీ తీస్తున్న ఈ మూవీపై విజయ్ ధీమాగా ఉన్నాడు. ఈ సినిమాతో తెలుగు నాట మంచి మార్కెట్ సంపాదించగలను అని అనుకుంటున్నాడు. 

సూర్య, కార్తీ వంటి హీరోల్లా విజయ్ కి ఇప్పటివరకు తెలుగునాట బిగ్ మార్కెట్ లేదు. ఆ లోటు ఈ సినిమా తీరుతుందా?