ఆమె బాటలో విజయ్ సేతుపతి

Vijay Sethupathi's film didn't release
Friday, November 15, 2019 - 16:30

కొన్ని రోజుల కిందట అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో చెలరేగిన గందరగోళం అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆన్ లైన్ లో టిక్కెట్లు కూడా అమ్మిన తర్వాత ఆఖరి నిమిషంలో ఆర్థిక కారణాల వల్ల విడుదల ఆగిపోయింది. 24 గంటలు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు 'విజయ్ సేతుపతి' సినిమాకు కూడా ఎదురైంది.

తమిళ్ లో 'సంగ తమిళన్' అనే సినిమా చేశాడు విజయ్ సేతుపతి. ఇదే సినిమాను తెలుగులో 'విజయ్ సేతుపతి' పేరుమీదే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. లెక్కప్రకారం, ఈ మూవీ ఈరోజు థియేటర్లలోకి రావాలి. బుకింగ్స్ కూడా జరిగిపోయాయి. కానీ లాస్ట్ మినిట్ లో సినిమా రిలీజ్ ఆగిపోయింది.

ఇది కూడా ఆర్థిక వ్యవహారాల వల్లనే ఆగిపోయింది. ప్రస్తుతం మేకర్స్ ఈ సమస్యను అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు. సాయంత్రం నుంచి షోలు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రేపు ఉదయం ఆట నుంచి మొదలుపెడితే మంచిదని సలహా ఇస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రమే మీడియా షో వేశారు. సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో జర్నలిస్టులంతా రివ్యూలు పెట్టడం ఆపేశారు.