విజయ్ కి అఫైర్లు, ఎచ్ఐవి: వనిత
నటుడి విజయ్ ఆత్మహత్య ఒక విషాదం. ఐతే ఈ కేసులో దిగ్భ్రమ కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. ఏదీ నిజం ఏది అబద్దమో ఇపుడే చెప్పలేం. ఆ వైపు నుంచి, ఈ వైపు నుంచి అనేక సంచలన విషయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణల పర్వం మొదలైంది.
విజయ్ సెల్ఫీ వీడియో బయటికి వచ్చిన కొద్ది నిమిషాల తర్వాత ఆయన భార్య వనిత మీడియాతో మాట్లాడారు. విజయ్‌కి పలువురితో సంబంధాలు ఉండేవని, ఇద్దరు అమ్మాయిలను తమ ఇంటికే తీసుకొచ్చాడని, అప్పటి నుంచి తమ మధ్య గొడవలు మొదలయ్యాయని వనిత చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆయనకి ఓ వ్యాధి ఉందని, ఆ కారణం వల్లే ఆయన చనిపోయి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత జబ్బు ఏమి ఉంటుందని మీడియా ప్రశ్నిస్తే....విజయ్‌కి ఎచ్ ఐవి ఉందని ఆమె సంచలన ప్రకటన చేశారు.
"అవును..ఆయనకి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉండేవి. ఆ విషయంలోనే మా మధ్య గొడవ మొదలైంది. ఇటీవల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని, మళ్లీ విడిపోయినట్లు కూడా విన్నాన"ని ఆమె చెప్పారు.
మరి మీ భర్త పోస్ట్ చేసిన వీడియోలో మీకు శశిధర్‌కి అఫైర్ ఉందని, వ్యభిచారం కూడా చేశారని చెప్పారు కదా అని అడిగితే - "విజయ్ ఎన్నోసార్లు నీచంగా మాట్లాడాడు కానీ తన భార్య గురించి ఇంత దారుణమైన అబద్దాలు చెప్పగలడని అనుకోలేదు. ఒక అమ్మాయి మీద నెపం నెట్టాలంటే ఇంతకన్నా నీచమైన కామెంట్లు ఏమీ ఉండవు కదా", అని సమాధానం ఇచ్చింది.
- Log in to post comments