కథ ఆమె చుట్టే తిరగాలి!

Vijayashanti reveals reason for not signing films
Thursday, April 9, 2020 - 13:30

విజయశాంతి మరో కొత్త మూవీ ఎందుకు సైన్ చేయట్లేదు? ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. లేడి అమితాబ్ తన కొత్త ఇన్నింగ్స్ ని "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో మొదలుపెట్టారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఆమె మాత్రం ఇంకో సినిమా ఒప్పుకోలేదు. "ఎఫ్ 3" లో కూడా విజయశాంతి నటిస్తారు అని ఇంతకుముందు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆమె ఆ సినిమాపై ఆసక్తి చూపడం లేదు. 

దానికి రీజన్ ఏంటంటే... కథ ఆమె చుట్టే తిరగాలి అంట. "సరిలేరు నీకెవ్వరు"లో సూపర్ స్టార్ మహేష్ బాబు. అయినా, అతని పోరాటం అంతా విజయశాంతి కోసమే. ఆమె చుట్టే కథ ఉంటుంది. 

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సమానంగా స్టార్ డం పొందిన నటి ఆమె. ఇప్పుడు కూడా తన ఇమేజ్ అలాంటిదే అని ఆమె భావన. అందుకే ... ఏ సినిమా పడితే ఆ మూవీ ఒప్పుకోదంట.