కాంచీకి లిఫ్ట్ ఇస్తున్న విజయేంద్ర‌ప్ర‌సాద్‌

Vijayendra Prasad sets a movie for S S Kanchi
Friday, July 27, 2018 - 08:30

"బాహుబ‌లి", "భ‌జ‌రంగీ భాయ్‌జాన్" సినిమాలు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ని ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ రైట‌ర్‌ని చేశాయి. ఆయ‌న రాసే క‌థ‌ల‌కి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఆయ‌న స్ర్కిప్ట్‌ల‌కి డిమాండ్ ఉంది. బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌ల త‌ర్వాత ఆయ‌న రాసిన క‌థ‌లు (శ్రీవ‌ల్లి, జాగ్వార్ వంటివి) బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయింది. అంతే కాదు వాటిని క్రిటిక్స్ చీల్చి చెండాడారు. ఐనా ఆయ‌నకి డిమాండ్ త‌గ్గ‌డం లేదు. 

విజ‌య్ న‌టించిన "మెర్సల్" త‌మిళంలో పెద్ద హిట్ కావ‌డం ఆయ‌న‌కి ప్ల‌స్ పాయింట్‌గా మారింది. దాంతో ఇపుడు ఇరోస్ సంస్థ 10 సినిమాల‌కి ఆయ‌న‌తో ఒప్పందం చేసుకొంది. 

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ డీల్‌లో త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి అవ‌కాశం ఇచ్చేశాడు. ఎస్‌.ఎస్‌.కాంచీ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ సినిమాని సెట్ చేశాడు. కాంచీ డైర‌క్ష‌న్‌లో రూపొందిన ఒక థ్రిల్ల‌ర్ చాలా రోజులుగా విడుద‌ల‌కి నోచుకోవ‌డం లేదు. దాంతో విజ‌యేంద్ర‌ప్రసాద్ ఇరోస్‌కి కాంచీని సెట్ చేశాడు. మ‌రో సినిమాని సుకుమార్ డైర‌క్ష‌న్‌లో చేస్తార‌ట‌.