బుల్లితెరపై ఈవారం విజయ్ దే హవా

Vijay's Whistle gets good ratings on TV
Thursday, January 30, 2020 - 18:15

సంక్రాంతి సీజన్ ముగియడంతో స్మాల్ స్క్రీన్ కూడా చప్పబడింది. పెద్ద సినిమాలేవీ ప్రసారం కాలేదు. ఉన్నంతలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కింద విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాను ప్రసారం చేశారు. మరో తెలుగు సినిమా బరిలో లేకపోవడంతో.. రేటింగ్స్ లో విజయ్ మూవీనే నంబర్ వన్ గా నిలిచింది.

జెమినీ టీవీలో 19న తేదీ ఆదివారం ప్రసారమైన విజిల్ సినిమాకు 6.86 టీఆర్పీ వచ్చింది. విజయ్ డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ఇదే హయ్యస్ట్. కాకపోతే బార్క్ వచ్చిన తర్వాత ఇది హయ్యస్ట్. అంతకుముందు చూసుకుంటే.. విజయ్ నటించిన తుపాకీ సినిమాదే రేటింగ్స్ లో హవా.

ఇక మిగతా ఛానెళ్ల విషయానికొస్తే జీ తెలుగులో కూడా ప్రీమియర్ మూవీగా డబ్బింగ్ సినిమానే ప్రసారం చేశారు. విజయ్ ఆంటోనీ, అర్జున్ హీరోలుగా నటించిన కిల్లర్ సినిమాను 19వ తేదీ ఆదివారం ప్రసారం చేశారు. కానీ దీనికి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు. కేవలం 2.57 టీఆర్పీ మాత్రమే వచ్చింది.

ఈ రెండు సినిమాలు మినహా మిగతావన్నీ రిపీటెడ్ మూవీసే. సమంత నటించిన ఓ బేబీ మరోసారి రేటింగ్స్ లో మెరవగా.. ఎప్పట్లానే బాహుబలి-2, భరత్ అనే నేను, మిడిల్ క్లాస్ అబ్బాయి, కాంచన-3 సినిమాలకు మినిమం గ్యారెంటీ రేటింగ్స్ వచ్చాయి.