బుల్లితెరపై మెగా హీరోల హవా

Vinaya Vidheya Rama tops this week on TV
Thursday, April 9, 2020 - 14:45

లాక్ డౌన్ వల్ల టీవీ వీక్షకుల సంఖ్య పెరిగింది. ఇంటిల్లిపాది ఇళ్లకే పరిమితం కావడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య అంతా టీవీలే చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల్లేకపోయినా, ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమాలకు కూడా మంచి రేటింగ్స్ రావడం విశేషం. అలా ఈ వారం టాప్-5లో నిలిచిన సినిమాలేంటో చూద్దాం.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన వినయ విధేయ రామ సినిమాకు ఈసారి హయ్యస్ట్ రేటింగ్ వచ్చింది. ఆ సినిమాకు 7.53 (అర్బన్+రూరల్) టీఆర్పీ వచ్చింది. రెండో స్థానంలో ధృవ (5.95), మూడో స్థానంలో గద్దలకొండ గణేశ్ (5.70), నాలుగో స్థానంలో గీతగోవిందం (5.24), ఐదో స్థానంలో వదలడు (5.08) సినిమాలు నిలిచాయి. అలా తొలి 3 స్థానాల్లో మెగా హీరోలు నిలవడం విశేషం.

వీటిలో వదలడు సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో ప్రసారం చేశారు. సిద్దార్థ్ నటించిన ఈ సినిమాను ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేసినప్పటికీ.. దీనికంటే చరణ్ సినిమాలకే ఎక్కువ రేటింగ్స్ రావడం విశేషం.

ఇవన్నీ పక్కనపెడితే.. ఈ వారం రేటింగ్స్ పరంగా టాప్-5లో ఈటీవీ న్యూస్ నిలిచింది. టాప్-5 టీఆర్పీస్ అన్నీ ఈ న్యూస్ బులెటిన్స్ కే వచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా భయాలు ఉన్న వేళ.. ఎక్కువమంది ఈటీవీ న్యూస్ చూడ్డానికి ప్రాధాన్యం ఇచ్చారు. పైగా కార్తీకదీపం సీరియల్ ఆగిపోవడంతో (లాక్ డౌన్ కారణంగా) ఈటీవీ 9PM న్యూస్ టాప్ లోకి వచ్చింది.