వినాయక్ తగ్గాడా? పెరిగాడా?

Vinayak back to old physique
Wednesday, December 11, 2019 - 09:45

హీరోగా మారిపోయాడు.. కొత్త సినిమా కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు.. మనిషి పూర్తిగా మారిపోయాడు.. ఇదిగో వీవీ వినాయక్ స్లిమ్ లుక్... ఇలా వినాయక్ పై ఆమధ్య చాలా స్టోరీలు నడిచాయి. అందులో ఏ మాత్రం తప్పులేదు. తాను తగ్గినట్లు ... అప్పట్లో విడుదలైన స్టిల్ లో వినాయక్ నిజంగానే స్లిమ్ గా కనిపించాడు కూడా. జిమ్ కి వెళ్లి నిజంగానే కసరత్తులు చేశాడు. ఆ స్టిల్ మార్ఫింగ్ చేశారేమో అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే... అప్పటి ఫొటోలో ఉన్నట్టు ఇప్పటి వినాయక్ లేడు మరి.

సి.కల్యాణ్ షష్టిపూర్తి చేసుకున్నాడు. అతడి 60వ పుట్టినరోజుకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో పాటు వినాయక్ కూడా వెళ్లాడు. ఆ ఫ్రేమ్ లో చిరు, బాలయ్య కంటే అందర్నీ వినాయకే ఎక్కువ ఆకర్షించాడు. అవును.. మరోసారి తన ఓల్డ్ ఫిజిక్ తో కనిపించాడు వినాయక్. మనిషి ముఖం చూస్తే కాస్త తగ్గినట్టుంది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్.

ఇది బాడీ షేమింగ్ కాదు. అతడు శీనయ్య అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో 35-40 ఏళ్ల మధ్య వయష్కుడిగా అతడు కనిపించాలి. ఆ క్యారెక్టర్ కోసమే వినాయక్ అప్పట్లో తెగ కసరత్తులు చేశాడంటూ వార్తలొచ్చాయి. కానీ అప్పటి ఫిజిక్ ను పూర్తిగా కోల్పోయాడు వినాయక్. అలా అని సినిమా షూటింగ్ పూర్తవ్వలేదు. మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది. అంతలోనే వినాయక్ షేపవుట్ అయ్యాడు.