ర‌వితేజ‌కి దొరికిన అమెరికా వీసా

Visa issue solved for Ravi Teja's Amar Akbar Antony
Thursday, August 2, 2018 - 00:15

ఎట్ట‌కేల‌కి అమెరికా వీసా ద‌క్కింది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టీమ్‌కి. ఈ సినిమా టీమ్ వీసా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. హీరోయిన్ల‌కి వీసాలు ఇచ్చేందుకు అమెరికా అధికారులు ఆస‌క్తి చూప‌డం లేదు. చికాగో సెక్స్ కుంభ‌కోణం త‌ర్వాత ప్ర‌తి హీరోయిన్ని, ప్ర‌తి క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్‌ని అనుమానాల క‌ళ్ల‌ద్దాల‌తోనే చేస్తున్నారు అమెరికన్ ప్ర‌భుత్వ అధికారులు. అందుకే ఈ మ‌ధ్య తెలుగు న‌టీమ‌ణుల‌కి వీసా దొర‌క‌డమ‌నేది గ‌గ‌నంగా మారింది.

అలాగే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనికి ఇత‌ర క‌ష్టాలున్నాయి. ఆ క‌ష్టాలతో పాటు ఇది కూడా తోడైంది. ఐతే నిర్మాత‌ల‌కున్న ప‌లుకుబ‌డితో ఇపుడు టీమ్ మొత్తానికి షూటింగ్ వీసా దొర‌కింది. క‌థ ప్ర‌కారం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాలి. అమెరికాలో దాక్కున్న విల‌న్‌ల‌ను హీరో చంపుతాడు. ఇది ప‌క్కా రివెంజ్ డ్రామా. అందుక‌ని అమెరికా వీసా కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేశాడు వైట్ల‌.

ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ఇలియానా న‌టిస్తోంది. డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుపుతున్నారు.