మాజీ లవర్స్..హాట్ పెయిర్స్

విడిపోతే కలవడం చాలా ఇష్టం. కానీ వెండితెరపై ఇది చాలా ఈజీ. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. అందుకే విడిపోయినా కలిసి నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడడం లేదు ఎన్నో జంటలు. ఇప్పుడీ లిస్ట్ లోకి విశాల్, వరలక్ష్మి కూడా చేరిపోయారు.
ఒకప్పుడు వీళ్లది లవ్ జంట. తర్వాత విశాల్-వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. వాటి పర్యవసానంగా వీళ్లిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ విశాల్-శరత్ కుమార్ మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో సన్నిహిత సంబంధాలు లేవు. కానీ విశాల్ సరసన నటించడానికి వరలక్ష్మి ఒప్పుకుంది. త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు విశాల్. ఇందులో ఒక హీరోయిన్ గా వరలక్ష్మిని తీసుకున్నారు.
మొన్నటికి మొన్న నయనతార-శింబు విషయంలో కూడా ఇదే జరిగింది. వీళ్లిద్దరూ ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ తెలుసు. ముద్దులు పెట్టుకునే ఫొటోలు, అత్యంత సన్నిహితంగా ఉండే స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. అలాంటి జంట విడిపోయింది. విడిపోయిన కొన్నేళ్లకు శింబు-నయన్ కలిసి ఓ సినిమా చేశారు. తమిళ్ లో అది ఈమధ్యే విడుదలైంది. తెలుగులో సరసుడు పేరుతో రిలీజ్ కు రెడీ అయింది.
అటు బాలీవుడ్ లో కూడా రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ కలిసి నటించారు. అదే జగ్గా జాసూస్ సినిమా. నిజానికి వీళ్లిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నప్పుడే సినిమా సెట్స్ పైకి వచ్చింది. అది షూటింగ్ స్టేజ్ లో ఉంటుండగానే ఇద్దరూ విడిపోయారు. మరోవైపు మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్-ఐశ్వర్యరాయ్, షాహిద్ కపూర్-కరీన్ కపూర్ కలిసి సినిమాలు చేస్తారనే రూమర్లు కూడా వస్తున్నాయి.
- Log in to post comments