విశాల్ ది డ్రామానా!

విశాల్ వేసిన నామినేషన్ తిరస్కరణకి గురైంది. నామినేషన్ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ విశాల్ ఆర్కేనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించారని , దీని వెనుక కుట్ర ఉందని విశాల్ ఆరోపించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఐతే విశాల్‌ది అంతా డ్రామా అని అధికార పార్టీ ఆరోపిస్తోంది. నిజంగా పోటీ చేసే ఉద్దేశమే ఉంటే నామినేషన్ పత్రాలు సరిగా ఉండేలా చూసుకునేవాడు కదా అని అధికార అన్నాడిఎంకే నేతలు అంటున్నారు. విశాల్, ఆయనతో పాటు కోలీవుడ్‌లోని కొందరు నటులు కొన్నాళ్ళుగా రియల్ లైఫ్‌లో బాగా యాక్టింగ్ ఒలకబోస్తున్నారని ఒక అధికార పార్టీ నేత ఘాటుగా విమర్శించాడు.
చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని గత వీకెండ్ విశాల్ ప్రకటించి సంచలనం కలిగించాడు. ఇక సోమవారం పూజలు చేసి సాయంత్రం ఇండిపెండెంట్ అభ్యర్తిగా నామినేషన్ వేశాడు. ఈ రోజు ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది. నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, అందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.
- Log in to post comments