ఆయుర్వేదంతో కరోనాని గెలిచిన విశాల్

Vishal gets cured of coronavirus with Ayurveda medicines
Sunday, July 26, 2020 - 13:15

కరోనా కల్లోలం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ డెత్ రేట్స్ కూడా ఆ రాష్ట్రాల్లోన్నే ఎక్కువ ఉండడం కలవరపరుస్తోంది. అలాంటి రాష్ట్రాల్లో ఒకటి.. తమిళనాడు. అయితే, ఆ రాష్ట్రాల్లోనూ వేలమంది బాగా రికవర్ అవుతుండడం ఆనందాన్నిచ్చే మాట. ఇంట్లోనే ఉండి కోలుకుకున్నాను అని చెప్తున్నాడు విశాల్.

హీరో విశాల్ నాన్న జీకే రెడ్డి కి ముందుగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు సహాయంగా పాటు తాను ఉన్నానని తెలిపిన విశాల్.. అదే సమయంలో తను కూడా హెవీ టెంపరేచర్, జలుబు, దగ్గుతో బాధపడినట్టు తెలిపాడు. అయితే, హాస్పిటల్ కి వెళ్లకుండా  ఆయుర్వేదం మందులు వాడి కరోనా ని జయించాడట. ఈ విషయాన్నీ తానే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నామని అంటున్నాడు. కరోనా రాగానే భయపడొద్దు.... ఇంట్లో ఉండి కూడా ఆరోగ్యంగా బయటపడొచ్చు. ముఖ్యంగా ఐసొలేషన్ లో ఉండడం, మంచి ఫుడ్ తినడం... ఇమ్మ్యూనిటీ పెంచుకోవడం ముఖ్యం. విశాల్, ఆయన 80 ఏళ్ల తండ్రి  కరోనని జయించడాన్ని బట్టి గ్రహించొచ్చు.