విశాల్ ఇలా మారిపోయాడు!

Vishal's real look during quarantine
Sunday, July 26, 2020 - 21:45

మేకప్ లేకపోతే చాలా మంది హీరోలు, హీరోయిన్లు మన పక్కింటి అబ్బాయిలు, పక్కింటి అమ్మాయిలు ఉన్నట్లుగానే ఉంటారు. కనిపిస్తారు. రేర్ గా కొద్దిమంది మాత్రం మేకప్ లేకున్నా, ఏజ్ మీద పడ్డా చాలా అందంగా ఉంటారు (ఐశ్వర్య, నాగార్జునలా). అందుకే చాలామంది హీరోలను, హీరోయిన్ల రియల్ లుక్స్ చూసి కంగారు పడుతుంటారు.

అదే జరిగింది... విశాల్ విషయంలో. కరోనా కారణంగా గత 15 రోజులుగా ట్రీట్ మెంట్లో ఉన్నాడు. ఇప్పుడు కోలుకున్నాడు. తన అనుభవాలు చెప్పి... కరోనాని ఎలా ఎదురుకోవాలో చెప్తూ ఒక మంచి సందేశాన్ని పోస్ట్ చేశాడు వీడియో రూపంలో. ఈ వీడియోలో సింపుల్ గా, ఎటువంటి మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించాడు. కొంచెం గడ్డం తెల్లబడడం, ముఖం కాస్త ఉబ్బడం... కనిపించింది. దాంతో అతని అప్పీరియన్సుపై కామెంట్స్ పడుతున్నాయి.

మేకప్ లేకపోతే మరీ ఇలా ఉంటావా అని విశాల్ ని టాగ్ చేస్తూ ఆశ్చర్యపడుతున్నారు.

కానీ విశాల్ 40 ఏళ్ళు దాటాడు. పైగా కరోనా కారణంగా ఎలాంటి గ్రూమింగ్ చేసుకోలేదు అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.