ప్రధానిని కలిసిన మంచు ఫ్యామిలీ

Vishnu and Mohan Babu meet PM Modi
Monday, January 6, 2020 - 16:00

మోహన్ బాబు కుటుంబానికి, ప్రధాని మోదీకి మంచి స్నేహం ఉన్నట్లు ఉంది. ప్రధాని కాకముందు... 2014 ఎన్నికల ప్రచారం హైదరాబాద్ లో ప్రారంభించినపుడే మంచు లక్ష్మి ప్రధానితో సెల్ఫీ  దిగారు, ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రధానిని మరోసారి కలిసింది మంచు కుటుంబం. వీరి మీటింగ్ ఒక పెద్ద సర్ప్రైజ్ . ప్రధాని మోడీ ఇప్పుడు సీఎంలకే అపాయంట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రేంజ్లో బిజీ గా ఉన్నారు మోది. కానీ.. మోహన్ బాబు, అయన కుమారుడు విష్ణు కూతురు లక్ష్మి, కోడలు విరోనికాలకి అడిగిన వెంటనే మీటింగ్ కి టైం ఇచ్చారు మోదీ.

మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు ప్రధానిని కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో? 

"ప్రధాని నుంచి ఏంతో  నేర్చుకోవచ్చు. ఆహా ఏమి ఎనర్జీ. మీటింగ్ సూపర్ గా జరిగింది. ప్రధానికి విష్ణు దశావతారాల పెయింటింగ్ ఇచ్చాను," అంటూ విష్ణు ఫొటోస్ కూడా షేర్ చేసారు.