వాళ్లను మిస్సవుతున్నాను: విశ్వక్

Vishwak Sen misses being with friends
Sunday, August 2, 2020 - 14:30

విశ్వక్ సేన్ చాలా డల్ గా ఉన్నాడు. దానికో రీజన్ ఉంది. ఈరోజు ఫ్రెండ్ షిప్ డే. ప్రతి ఏటా ఫ్రెండ్ షిప్ డేను స్నేహితులతో సరదాగా సెలబ్రేట్ చేసుకునే విశ్వక్ కు, ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే బయట కరోనా ఉంది కదా. అందుకే తన బాధను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు ఈ హీరో.

"నా ఫ్రెండ్స్ ను మిస్సవుతున్నాను. కరోనా వల్ల ఎవ్వర్నీ కలవలేకపోతున్నాను. ఆల్ లైన్ లో ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడడంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నా పరిస్థితి ఎలా ఉందంటే.. పక్క గల్లీలో ఉన్న ఫ్రెండే అమెరికాలో ఉన్నట్టు అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందర్నీ మిస్ అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడంలేదు."

భౌతికంగా ఫ్రెండ్స్ ను కలిసే వీలు లేకపోయినా.. వర్చ్యువల్ గా అందరికీ హగ్స్ ఇస్తున్నానంటూ ఓ ఎమోజీ వదిలాడు ఈ హీరో.

ప్రస్తుతం "పాగల్" అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. దీంతో పాటు ఓ తమిళ్ రీమేక్ కూడా లైన్లో ఉంది.