విశ్వక్ Vs విజయ్ దేవరకొండ..అసలు గొడవేంటి?

విశ్వక్ సేన్ సడెన్‌గా వార్తల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ యువ హీరోని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. విజయ్ దేవరకొండలా మాట్లాడం వల్లనో, ఆడియో ఫంక్షన్‌లో బూతు పదం వాడడం వల్లో విజయ్ దేవరకొండ కాలేరు అని వారు విమర్శించారు. ఇదంతా "ఫలక్‌నుమాదాస్" సినిమా విడుదలైన తర్వాత జరిగింది. "ఫలక్‌నుమా దాస్" సినిమా పెయిడ్ ప్రీవ్యూస్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేశారు. సినిమా కూడా చాలామందిని మెప్పించలేదు. సో... అలా కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ దీని వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడేమో అన్న రేంజ్‌లో విశ్వక్‌సేన్ మాట్లాడాడు. తనని తిట్టిన వాళ్లందర్నీ "దె...* అంటూ బూతుపదం వాడడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
సోమవారం హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు. వరుసగా రెండు రోజులు నిద్రలేకపోవడం వల్ల అలా చేశానన్నట్లుగా ఏదో వివరణ ఇచ్చాడు. ఐతే.. ఈ మొత్తం వివాదం వెనుక పక్కా పబ్లిసిటీ స్కెచ్ అన్న కామెంట్‌లు కూడా వినిపిస్తున్నాయి.
"ఫలక్‌నుమా దాస్" అనే చిత్రం గత శుక్రవారం విడుదలైంది. "అంగమలీ డైరీస్" అనే మలయాళీ చిత్రానికిది రీమేక్. ఇందులో హీరో అతనే. దర్శకుడు అతనే. విశ్వక్ సేన్ ...ఇంతకుముందు వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో హీరోగా నటించాడు. "ఫలక్‌నుమా దాస్" అతనికి హీరోగా మూడో చిత్రం, దర్శకుడిగా తొలి చిత్రం. మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు అందుకొంది. ఐతే... బూతులు మాట్లాడడం, రెక్‌లెస్‌గా తిట్టడంతోనే ఈ సమస్య.
పుట్టింది నిజమాబాద్‌లో, పెరిగింది హైదారబాద్‌లో. మొదటి రెండు సినిమాల్లో నటించినపుడు ఇంత ర్యాష్ ప్రవర్తన లేదు. ఇపుడు సడెన్‌గా ఇలా ప్రవర్తించడంతోనే వార్తల్లో నిలిచాడు.
ప్రెస్‌మీట్‌లో అతను ఇచ్చిన వివరణ ఏంటంటే..
- నేను నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతా
- ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులో చివరి 6 నిమిషాల వీడియో వివాదాస్పదం చేశారు. ముందు మాట్లాడినది పట్టించుకోలేదు.
- కొందరు పనిగట్టుగొని నా సినిమాపై వివాదం సృష్టిస్తున్నారు
- రెండేళ్లు కష్టపడి ఎంతో శ్రమించి తీసిన సినిమాను విమర్శిస్తున్నారు
- డబ్బులెక్కువై సినిమా తీయలేదు. నా సినిమాలో మా కుటుంబం, స్నేహితుల డబ్బు ఉంది. 10 కోట్ల నష్టం వాటిల్లుతుందనే అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడటం తప్పే, క్షమించండి
- నేను రివ్యూ రైటర్ల గురించి అసభ్యంగా మాట్లడ లేదు. నేను రివ్యూ రైటర్లను తిట్టినట్లు నిరూపిస్తే పరిశ్రమ నుంచి వెళ్లిపోతాను.
- నా పోస్టర్లు చించాల్సిన అవసం ఏముంది
- : నేను ఎవరికి భయడటం లేదు
- ఈవీకెండ్ లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రం నాదే
- నా సినిమాపై ఎందుకు అంత పగపడుతున్నారు. ప్రేక్షకులను తిట్టడానికి నాకు బుర్రలేదనుకుంటున్నారా. ప్రేక్షకులు నా సినిమాను బతికిస్తున్నారు.
- సినిమా హిట్టైందని కళ్లు నెత్తికెక్కే టైపు కాదు నేను
- Log in to post comments