మార్చి 1న అజిత్‌ విశ్వాసం

Vishwasam releasing on March 1
Thursday, February 21, 2019 - 11:15

"వీరం", "వేదాళం", "వివేకం" వంటి హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా `విశ్వాసం`. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజిత్ స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ అసోషియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు.

"ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను. అవ‌కాశం ఇచ్చిన స‌త్య‌జ్యోతి ఫిలింస్ వారికి నా ధన్య‌వాదాలు. స‌త్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేష‌న్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుద‌ల చేయ‌బోతున్నాం. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అవుతుంది`` అన్నారు ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు.