హీరోయిన్ కూడా ఆవకాయ పెట్టేసింది

Vithika prepares Avakaya pickle
Wednesday, May 13, 2020 - 11:45

ఇది ఆవకాయ పచ్చడి (మాంగో పికిల్) పెట్టే టైం. ఒకప్పుడు దాదాపు ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఈ సీన్ కనిపించేది. ఇప్పుడు ఆ కల్చర్ దాదాపుగా మాయమయింది థాంక్స్ టు ప్రియా పచ్చళ్ళు, స్వగృహ ఫుడ్స్. ఐతే లాక్డౌన్ పుణ్యమా అని మళ్లీ ఆ సీన్ కనిపిస్తోంది.

మామిడికాయలు తెచ్చుకొని, కట్ చేసుకొని... పచ్చడి పెట్టె కార్యక్రమాలు హీరోయిన్లు కూడా చేస్తున్నట్లు  ఉంది. వరుణ్ సందేశ్ భార్య, ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితిక కూడా ఆవకాయ పచ్చడి పెట్టిందట. ఆమె ఇన్ స్టాలో ఫోటో కూడా షేర్ చేసింది.

మొత్తానికి లాక్డౌన్ వల్ల హీరోయిన్ల కిచెన్ వ్యవహారాలు బయటికి వచ్చాయి. దాదాపుగా ప్రతి హీరోయిన్ ఎదో ఒక వంట చేస్తూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు.