భార్యాభర్తలని విడదీస్తోన్న బిగ్ బాస్!

Vithika Sheru to be eliminated
Saturday, October 19, 2019 - 16:15

బిగ్ బాస్ షో మూడో సీజన్ ..ముగింపు దశకి చేరుకొంది. ఇంకా ఏడుగురు హౌస్ లో ఉన్నారు. సో... మరికొందరి ఎలిమినేషన్ తప్పదు. వితిక షేరు, వరుణ్ సందేశ్ ల జంటపై బిగ్ బాస్ కన్ను పడింది. ఈ వీకెండ్ వీరిద్దరిని విడదీసే పని పెట్టుకున్నాడా బిగ్ బాస్? వితిక ఫైనల్ రౌండ్ కి చేరదని అంటున్నారు. వితికని ఇంటికి పంపించే కార్యక్రమం ఉందని టాక్. 

మేరీడు కపుల్ బిగ్ బాస్ తెలుగు షోలోకి అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఈ జంటని విడదీస్తున్నారు. వితిక ఇంటి దారి పడితే ... గేమ్ రసవత్తరంగా ఉంటుంది. వితిక చాల తెలుగు సినిమాల్లో నటించింది. కానీ వాటి వాళ్ళ రాని గుర్తింపు ఈ షో వల్ల వచ్చింది.

ఇప్పటివరకు 90 ఎపిసోడులు పూర్తి అయ్యాయి. మరో పది ఎపిసోడులు మాత్రమే మిగిలాయాయి. సో మరి ఫైనల్ గా ఎవరు విన్ అవుతారో చూడాలి.