ఆత్రేయ కథ ఇప్పటిది కాదు

Vivek Athreya wrote Nani's story long back
Sunday, March 8, 2020 - 15:00

ఎట్టకేలకు నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మూవీ ఓకే అయింది. ఎట్టకేలకు అని ఎందుకన్నామంటే.. ఇది ఇప్పుడేదో కొత్తగా సెట్ అయిన ప్రాజెక్ట్ కాదు. దాదాపు మూడేళ్లుగా నాని పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇన్నాళ్లకు వివేక్ ఆత్రేయ తన వర్త్ ప్రూవ్ చేసుకోవడంతో నాని ఛాన్స్ ఇచ్చాడు. అవి మెంటల్ మదిలో రోజులు. శ్రీవిష్ణుతో ఆ సినిమా చేస్తున్న టైమ్ లోనే నానికి కథ వినిపించాడు వివేక్ ఆత్రేయ. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఆ కథను నానితో మాత్రమే చేయడానికి ఫిక్స్ అయ్యాడు. నానికి కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ ఎందుకో వివేక్ కు వెంటనే అవకాశం ఇవ్వలేకపోయాడు.

కట్ చేస్తే, మెంటల్ మదిలో హిట్ అనిపించుకోపోయినా సెన్సిబుల్ మూవీ అనిపించుకుంది. ఆ తర్వాతొచ్చిన బ్రోచేవారెవరురా సినిమా సెన్సిబుల్ మూవీతో పాటు కమర్షియల్ మూవీ అనిపించుకుంది. ఇలా 2 సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తర్వాత వివేక్ కు ఛాన్స్ ఇచ్చాడు నాని.

అయితే సినిమా సెట్ అయింది కానీ సెట్స్ పైకి రావడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పట్టొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్ పైకి వస్తుంది.