అఖిల్ కు హీరోయిన్ ఎందుకు దొరకట్లేదో తెలుసా?

Wanted heroine for Akhil Akkine! What's the issue?
Tuesday, July 4, 2017 - 15:15

అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పటివరకు మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటించలేదు. కనీసం ఫలానా పేర్లు పరిశీలిస్తున్నాం అని కూడా చెప్పలేదు. దీనికి కారణం ఏంటనే విషయం తాజాగా తెలిసింది.

అఖిల్ సినిమా అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. కానీ గమ్మత్తేంటంటే.. హీరోయిన్ మాత్రం కనిపించదట. అవును.. అనుకోని పరిస్థితుల వల్ల దాక్కున్న హీరోయిన్ ను వెదికే పనిలో హీరో ఉంటాడట. అలా కథ మాత్రం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది కానీ ఆమె సినిమాలో పెద్ద‌గా కనిపించదు. సినిమా క‌థ అంతా ఆమె చుట్టే కానీ ఆమె తెర‌పై క‌నిపించే నిడివి చాలా త‌క్కువ‌. అందుకే ఇలాంటి కథలో నటించడానికి హీరోయిన్లు  ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అలియా భట్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు ఈ సినిమాకు నో చెప్పడానికి కారణం ఇదే అని తెలుస్తోంది. దీంతో ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు.

విక్రమ్ కుమార్ సినిమాల్లో కథలు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అఖిల్ తో తీస్తున్న సినిమా కూడా విక్రమ్ కుమార్ మార్క్ లోనే గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. సరికొత్త స్క్రీన్ ప్లేతో సాగుతుందట.

ఈ సినిమాకు మొన్నటివరకు "జున్ను", "ఎక్కడ ఎక్కడ ఉందో తారక" టైటిల్స్ ను అనుకున్నారు. తాజాగా "మళ్లీ కలుద్దాం" అంటూ మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ మూడు టైటిల్స్ లో ఒకదాన్ని ఫిక్స్ చేస్తారని స‌మాచారం.